హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా ఏడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో అత్యధికంగా 6.67 సెం.మీ, చిన్నగూడురులో 4.36 సెం.మీ, నర్సింహులపేటలో 2.83 సెం.మీ, దంతాలపల్లిలో 2.79 సెం.మీ, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో 3.96 సెం.మీ, నల్లగొండ జిల్లా గుర్రంపోడులో 3.49 సెం.మీ, గట్టుప్పల్లో 3.13 సెం.మీ, యాదాద్రి-భువనగిరి జిల్లా నారాయణపూర్లో 2.64 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది