హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం నుంచి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని, ఏప్రిల్ 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.