హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన వర్షాలు.. మళ్లీ పుంజుకుంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.
సోమవారం నుంచి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. హైదరాబాద్‌తో పాటు పలుజిల్లాల్లో వచ్చే వారంపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.