Rain Alert | రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బుధవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, జగిత్యాలలో మోస్తరు వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో 231 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. బోనగిరిలో 13 సెంటీమీటర్లు, తుర్కపల్లి (ఎం)లో 11.8 సెంటీమీటర్లు వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.