TG Weather | తెలంగాణలో ఓ వైపు ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలో భిన్న వాతావరణం ఏర్పడుతున్నది. పొద్దంతా ఎండలు దంచికొడుతుండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తున్నది. మరో రాబోయే రెండురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు ఉండవని.. ఆ తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని వాతావరణశాఖ తెలిపింది. అదే సమయంలో రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయంటూ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది.
అలాగే, మంచిర్యాల, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. ఈ నెల 5న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వానలు కొనసాగుతాయంటూ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసిందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం.