Rains | తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు.. 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. 7వ తేదీ వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్(Warangal), యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
7వ తేదీ సూర్యాపేట, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. 8వ తేదీ పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉండగా, 9వ తేదీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని అధికారులు వివరించారు.
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు
ఈనెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది 8వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మోచా’ తుఫాన్( Mocha Strom) ఏర్పడే అవకాశముందని, వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు(Heavy Rains) పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మోచా తుఫాన్ ముప్పుతో తెలంగాణ(Telangana)తో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), ఒడిశా(Odissa) రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
గురువారం భద్రాచలంలో 2.6 మి.మి వర్షపాతం నమోదవ్వగా, మెదక్లో 8 మి.మీ, నిజామాబాద్లో 36.8 మి.మి వర్షపాతం నమోదైంది. అటు రాష్ట్రంలో ఆదిలాబాద్లో అత్యధికంగా ఆదిలాబాద్లో 34.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, హయత్నగర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 19.6 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 30 డిగ్రీల లోపు గరిష్ఠ, 20 డిగ్రీలపైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట కాస్త ఎండ ప్రభావం ఉండగా, సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురుస్తోంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

