హైదరాబాద్,సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటలుగా రాష్ట్రంలోని కరీంనగర్, మెదక్, జనగామ, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి, నాగర్కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ మండలంలో 22.15 సెం.మీ, ములుగు జిల్లా మల్లంపల్లిలో 21.70 సెం.మీ వర్షపాతం న మోదైనట్టు అధికారులు వెల్లడించా రు. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ దిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబా ద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.