Rain Alert | హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నది. సంతోష్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, శామీర్‌పేట, నిజాంపేట, బాచుపల్లి, కూకట్పల్లి ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్‌తో పాటు మేడ్చల్ జిల్లా దుండిగల్, గండిమైసమ్మ, బౌరంపేటతో పాటు పలు చోట్ల వర్షం కురుస్తున్నది. వర్షంతో రోడ్లపై వర్షం నీరు నిలిచింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్, నిర్మల్‌తో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. మరో వైపు బుధవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.