కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌లో భాగంగా సిద్దిపేట నియోజకవర్గం చిన్నకోడూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటు కోరుతూ.. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఫ్లోర్‌లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు జూన్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు.
దీనికి స్పందించిన కేంద్ర మంత్రి చిన్నకోడూరులో రైల్వేస్టేషన్‌తోపాటు హాల్టింగ్ పాయింట్ మంజూరు చేస్తూ గురువారం బీఆర్ఎస్ ఎంపీలకు ఉత్తరం రాశారు. రైల్వేస్టేషన్ మంజూరుపై చిన్నకోడూరు ప్రజలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.