హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు ఆయన విమానం ద్వారా చేరుకోనున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన వరంగల్‌కు వెళ్తారు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత.. రాహుల్ గాంధీ రైలులో చెన్నై వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ రాహుల్ ఎందుకు వరంగల్ వెళ్తున్నారన్న దానిపై పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అన్న అంశంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.