Manne Krishank | కాంగ్రెస్ సర్కార్ ప్రతి బడ్జెట్ మోసపూరితమేనని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారని.. రేవంత్ దిష్టిబొమ్మ కూడా దహనం చేశారని తెలిపారు.
రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ టూరిస్టు అని మన్నె క్రిశాంక్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ అగ్రనేతలు ఊదరగొట్టారని గుర్తుచేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిక్లరేషన్‌ను అమలు చేయలేదని మండిపడ్డారు. అధికారం కోసం మోసపూరిత హామీలు ఇచ్చిందని తెలిపారు.