హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హై దరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి వినూత్న నిరసన ప్రకటించారు. రాహుల్ గాంధీ గత సంవత్సరం ఎన్నికల సమయంలో ఇదే నెల(నవంబర్ 25న) హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్‌లో పర్యటించారు. ఆయన నిరుద్యోగులను కలిసి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. వినూత్న నిరసన వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో పర్యటించి సంవత్స రం కావస్తున్నది, లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయిం ది? తదితర విషయాలను అశోక్‌నగర్ వచ్చి బావర్చీలో బిర్యానీ తింటూ మాట్లాడుకునేవా ళ్లం’ అని పేర్కొన్నారు. తనతో కలిసి బిర్యానీ తినకపోయినా పర్వాలేదు కానీ, ఒకసారి ని రుద్యోగులను కలిసివెళ్లాలని కోరారు. ఆరు గ్యారెంటీలు ఎందాక వచ్చాయో తెలుసుకోవాలని సూచించారు.
రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోని ఎనుమాముల మారెట్ కు వెళ్లి రైతులను కలువాలని కోరారు. ఎరువు లు, విత్తనాల కోసం ఇబ్బందులు, ధాన్యం కొనుగోళ్లు లేక అన్నదాతల అవస్థలను అడిగి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు.. కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల పర్యటనలో బిజీబిజీగా ఉన్నారని, రా ష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్‌గాంధీ అన్ని వర్గాల యోగక్షేమాలను తెలుసుకోవాలని సూచించారు.