Revanth Reddy | 30 ఏండ్లు కాంగ్రెస్లో ఉండి.. ఇప్పుడు పార్టీ మారారు. ఎందుకు?
పార్టీ అంటే నాయకుని మీద నమ్మకం ఉండాలె. కార్యకర్తలను కాపాడుకోవాలన్న సోయి ఉండాలె. ఇవేవీ కాంగ్రెస్లో ఉండవు. లేవు. అందుకే బయటకొచ్చిన.
గతంలో మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఏమనిపిస్తుంది?
నాకైతే సంతోషంగా ఉన్నది. ప్రజలకు మంచి చేసే పార్టీ తరఫున పనిచేస్తున్న. బండారి లక్ష్మారెడ్డన్న నాకు మంచి మిత్రుడు. నా మిత్రుడి గెలుపు కోసం పనిచేస్తున్నా. గెలిపిస్తా.
రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెట్టారు. కారణం?
రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు. ఒక నియంత. బిజినెస్ మ్యాన్. ఒక కంపెనీకి సీఈవో ఎట్లనో కాంగ్రెస్కు ఆయన అట్ల అనుకుంటున్నడు. నాకు సీటు ఇయ్యలేదనో.. మరో కారణంతోనో నేను మాట్లాడటం లేదు. నా ఆవేదన నన్ను మాట్లాడిస్తుంది. ముందు ముందు ఇంకా చాలామంది నాలాంటి వాళ్లు కాంగ్రెస్ నుంచి బయటకొస్తారు చూడండి.
ఉప్పల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
గుర్తు పెట్టుకోర్రి ఉప్పల్ నియోజకవర్గంల కాంగ్రెస్ పార్టీకి బూత్ ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు కూడా దొరకరు. నవంబర్ 30 నాడు మీరే చూస్తరు. 50 వేల మెజారిటీతో బండారి లక్ష్మారెడ్డి గెలుస్తడు. ఇద్దరు లక్ష్మారెడ్డిలు
ఏకమయ్యారు.
మొన్నటి వరకు బండారి వర్సెస్ రాగిడి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ప్రజలు ఎలా స్పందిస్తున్నారు.
రాజకీయంగా మాత్రమే మా ఇద్దరి మధ్య పోటీ. ఇప్పుడు ఇద్దరం ఒకే పార్టీ. బండారి అండ్ రాగిడి ఈక్వల్ టు విక్టరీ. ఇక ప్రజలంటారా..? ఏం జరిగిందో వాళ్లకు తెలుసు.