నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి రాధాకిషన్‌రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనకు హైకో ర్టు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేయడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యా రు. ప్రస్తుతం ఈ కేసులో మధ్యంతర బెయిల్‌పై కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం వారు రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తులను 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు సమర్పించారు. రాధాకిషన్‌రావు తన పాస్‌పోర్టును కోర్టుకు జమ చేశారు. హైకోర్టు షరతుల ప్రకా రం వారిద్దరూ ప్రతి సోమవారం ఉద యం 11 గంటలకు పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉం టుంది. దర్యాప్తు అధికారికి సహకరించాలని, సాక్షులతోపాటు వారి కుటుంబీకులను ప్రభావితం చేయరాదని, మీడియా సమావేశాల్లో పాల్గొనరాద ని నిందితులకు కోర్టు స్పష్టం చేసింది.
4,357 మంది పిల్లలకు విముక్తి ; ఆపరేషన్ స్మైల్ వివరాలు వెల్లడించిన శిఖాగోయెల్
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనవరి 1 నుంచి 31 వరకు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్-XI’ ద్వారా 4,357 మంది పిల్లలను వెట్టిచాకిరి నుంచి విముక్తుల్ని చేసినట్టు ఉమెన్‌సేఫ్టీ వింగ్ డీజీ శిఖాగోయెల్ వెల్లడించారు. ఆపరేషన్ స్మైల్ వివరాలను శుక్రవారం ఆమె మీడియాకు వివరించారు. ఈ నెలలో రెస్క్యూ చేసిన వా రిలో బాలకార్మికులు 3,940 మంది ఉన్నారని తెలిపారు. మొత్తం 4,357 మంది చిన్నారుల్లో బాలురు 3,897 మంది, బాలికలు 460 మంది ఉన్నారని, వారిలో 3,905 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చినట్టు శిఖాగోయెల్ వెల్లడించారు. పిల్లల అక్రమ రవాణాకు పాల్పడిన 1,040 మంది పై 1,038 కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలిపారు.