R.S. Praveen Kumar | రేవంత్ రెడ్డికి హోం శాఖ బాధ్యతలు చూసే అర్హత లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మతిభ్రమించిన ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నాడో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మన్నె క్రిషాంక్‌ను కూకట్పల్లి పోలీసులు రాత్రి అక్రంగా అరెస్ట్ చేశారు. ఆయన మీద ఆయన భార్య మీద కూడా కాంగ్రెస్ వాళ్లు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. ఈ మతిభ్రమించిన ముఖ్యమంత్రి ఏ విధంగా పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నాడో ప్రజలు గమనించాలని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి మీకు హోంమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్ర భద్రత కోసం సీక్రెట్‌గా పెట్టాల్సిన విషయాలన్నీ రేవంత్ రెడ్డి బైట పెట్టేశాడని ఆరోపించారు.
ప్రభుత్వ అక్రమాలను అన్నీ ఆధారాలతో తెలుగు స్క్రైబ్ సంస్థ బయటపెట్టింది. ఇలాంటి సంస్థను తట్టుకోలేక UAPA అనే యాంటీ టెర్రరిజం చట్టం ద్వారా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఐపీఎస్ అధికారుల ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నాడు. తెలుగు స్క్రైబ్ అనే సోషల్ మీడియా సంస్థకు సీఐ సెల్ అనే సంస్థ నుండి ఒక అధికారి ట్విట్టర్(X) ద్వారా నోటీసులు ఇచ్చారు.
99 శాతం మంది పోలీసులకు తెలియని సీఐ సెల్ అనే సంస్థ నుండి UAPA అనే చట్టం ద్వారా నోటీసులు ఇచ్చారు. ఇది కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టం అన్నారు. ఇలాంటి పవర్ ఫుల్ చట్టాన్ని తెలుగు స్క్రైబ్ అనే సంస్థ మీద ప్రయోగించాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టిన బీఆర్ఎస్ తరఫున ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
ప్రభుత్వ అక్రమాలను అన్నీ ఆధారాలతో తెలుగు స్క్రైబ్ సంస్థ బయటపెట్టింది
ఇలాంటి సంస్థను తట్టుకోలేక UAPA అనే యాంటీ టెర్రరిజం చట్టం ద్వారా అక్రమ కేసులు పెడుతున్నారు – బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/YPfJ9k55ph pic.twitter.com/NBkHHtOV84
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

