హైదరాబాద్ : నీట్ ప్రశ్నాపత్రం(Neet Exam) లీకేజీతో దేశం పరువుపోయిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్-యూజీ వివాదంపై ఆయన స్పందించారు. కేంద్రలోని బీజేపీ పాలనలో వ్యవస్థలు అన్ని కుప్పకూలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో లోటుపాట్లు, అవకవతకలను దాచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై ప్రధాని మోదీ(PM Modi) మౌనం వీడాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తో ముడిపడి ఉన్న అంశంపై ప్రధాని మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. నీట్ పేపర్ లీకేజీపై సూప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.