హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): సంక్షేమ హాస్టళ్ల అద్దె బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివా రం ప్రకటన విడుదల చేశారు.
సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి అద్దె బకాయిలు కొన్ని నెలలుగా బకాయి ఉన్నాయని, దీంతో యాజమాన్యాలు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయని వాపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కా కపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడం లేద ని వెల్లడించారు. వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.