హైదరాబాద్, అక్టోబర్25 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లను పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఢిలీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కులగణనకు సీపీఐ ఏకగ్రీవం గా మద్దతు తెలుపుతుందని, పార్టీ జాతీయ సమావేశాల్లో తీర్మానం చేసినట్టు రాజా గుర్తుచేశారని తెలిపారు. ఓబీసీ బిల్లు కోసం పోరాడతామని హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నందగోపాల్, రాఘవేంద్ర, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.