హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న నిరుద్యోగులపై ప్రభుత్వ నిర్బంధం సరైంది కాదని, వారి సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని పిలువాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో నిరుద్యోగుల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. గ్రూప్-1లో 1:100, గ్రూప్-2, 3 పోస్టులను పెంచడం, డీఎస్సీ వాయిదా, టీచర్ పోస్టులు తదితర అంశాలపై చర్చిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందని తెలిపారు.