హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : మన ఐఐటీల్లో చేరేందుకు విదేశీ విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం 66 మంది విదేశీ విద్యార్థులు మన దేశంలోని ఐఐటీల్లో అడ్మిషన్లు పొందారు. గత ఐదేండ్ల కాలంలో తీసుకొంటే ఏటా 10 మంది విద్యార్థులు కూడా చేరకపోగా, ఈ ఏడాది 66 మంది విద్యార్థులు చేరడం విశేషం. ఐఐటీల్లో విదేశీ పౌరులతో పాటు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు సీట్లు కేటాయిస్తున్నారు. వీరి కోసమే ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ సీట్లను సృష్టించి భర్తీ చేస్తున్నారు. 2020లో ఇద్దరు, 2021లో ఎనిమిది మంది మాత్రమే విదేశీ విద్యార్థులు ఐఐటీల్లో చేరారు.