హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : యువత చట్టాలపై అవగాహన పెంచుకొని అవినీతిని ప్రశ్నిస్తేనే మెరుగైన సమాజం ఏర్పడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉద్బోధించారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ క్యాలెండర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువతరం చెడు అలవాట్లకు బానిస కాకుండా అవినీతి రహిత సమాజంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను గమనిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఏసీ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి, కోర్ కమిటీ సభ్యులు కోమటి రమేశ్‌బాబు, డీ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ‘మా బిడ్డల చదువులు, వృ ద్ధులైన తల్లిదండ్రులు, స్థానికత వంటి స మస్యలతో నిత్యం సతమతమవుతు న్నాం.. తక్షణం తమను ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి’ అని ఏపీకి చెందిన 400 మంది హోంగార్డులు కోరుతున్నారు. ఆదివారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు బహిరంగ లేఖ రాశారు. ఇదే స్థానికత అంశానికి సం బంధించి ఏపీ నుంచి తెలంగాణకు రావడానికి కూడా 400 మంది హోంగార్డులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఏపీలో ఉంటే.. ఉద్యోగం తె లంగాణలో ఉందని, దీంతో 11 ఏండ్లుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తమను నాన్-లోకల్‌గా చూస్తున్నారని, అలాగే తెలంగాణవారిని ఏపీలో నాన్‌లోకల్‌గా పరిగణిస్తున్నారని, ఈ సమస్యకు ఇరు రాష్ర్టాల ప్రభుత్వ పెద్దలు త్వరగా పరిష్కారం చూపాలని కోరారు.