యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 15: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్ర సాదాన్ని మరింత పాదర్శకతతో విక్రయించే ప్రక్రియను దేవస్థానం ఆదివారం ప్రారంభించింది. గతంలో మ్యానువల్ టికెట్ పద్ధతికి స్వస్తి పలుకుతూ కంప్యూటరైజ్డ్ టికెట్‌తోపాటు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ కొనసాగుతున్నది. ప్రస్తుతం ఉదయం సమయం లో విక్రయించే దద్దోజనం, కట్టె పొంగలి, కేసరి బాత్ ప్రసాదాలకు మాత్రమే మ్యానువల్ టికెట్లతో విక్రయిస్తున్నారు. రూ.30 లడ్డూలు, రూ.150 అభిషేకం లడ్డూ, పులిహోర, వడ, మిల్లెట్ లడ్డూలను క్యూఆర్ కోడ్ కలిగిన కం ప్యూటరైజ్డ్ టికెట్లతో విక్రయాలు చేపట్టారు. కొండపైన శివాలయం ఎదురుగా టికెట్ కౌం టర్లు ఏర్పాటు చేసి ప్రసాదాల కంప్యూటరైజ్డ్ టికెట్లను విక్రయిస్తున్నారు. భక్తులు క్యూఆర్ కోడ్ కలిగిన టికెట్‌తో ప్రసాద కౌంటర్ల వద్దకు వెళ్లాలి. అక్కడ కౌంటర్లో దేవస్థాన సిబ్బంది టికెట్‌ను స్కాన్ చేస్తే.. ఎన్ని రకాల ప్రసాదాలు, వాటి సంఖ్య వివరాలు స్క్రీన్‌లో చూసి అందజేస్తున్నారు. మొత్తం 5 కౌంటర్లలో ఈ విక్రయాలు కొనసాగిస్తున్నారు.