యాదాద్రి, మార్చి 7: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ డిజిటల్ హుండీ విరాళం కోసం కెనరా బ్యాంకు క్యూఆర్ కోడ్ను రూపొందించింది. ఆన్లైన్ సేవ టికెట్, ఇతర డిజిటల్ విరాళాలు అందజేసే భక్తుల కోసం ప్రత్యేకమైన వెబ్సైట్ రూపొందించిన ఆలయ అధికారులు విరాళాల సేకరణను చేపడుతున్నారు. 2018 నుంచే వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురాగా.. మారుతున్న కాలానికి అనుగుణంగా గూగుల్ పే, ఫొన్ పే, పేటీఎం ద్వారా సులువుగా నగదు బదిలీ చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఆలయ అకౌంట్ విభాగం అధికారులు తెలిపారు.