భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : భద్రాచలంలో ఈ నెల 6, 7న జరిగే శ్రీరామనవమి, స్వామివారి మహా పట్టాభిషేకం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
స్వామివారి కల్యాణం జరిగే మిథిలా స్టేడియం, తలంబ్రాల కౌంటర్లు, పార్కింగ్ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మొబైల్లో భద్రాచలం సమాచారం వస్తుంది. ఆన్లైన్ లింక్‌ను అన్ని వాట్సాప్ గ్రూప్‌లలో అందుబాటులో ఉంచామని, bhadrachalam.netlify.app ను ఓపెన్ చేసుకోవచ్చని పోలీస్ తెలిపింది.