BRS | హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకున్నదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ జనరల్ సెక్రటరీ పీవీఎస్ శర్మ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఆ పార్టీ ప్రభావం చూపుతుందని తెలిపారు. ఇక ఆ రాష్ట్రంలో బీజేపీ మనుగడ కష్టమేనని, ఎంతగా పోరాడినా ఫలితం ఉండబోదని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కార్ను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుకున పెట్టబోదని పేర్కొన్నారు. రాష్ట్ర సర్కారును బీజేపీ విమర్శించబోదని, అస్థిరపర్చాలనీ చూడదని శర్మ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం స్థిరంగా ఉండాలనే బీజేపీ కోరుకుంటున్నదని తెలిపారు.