హైదరాబాద్ : దివంగత మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహ రావు దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. పీవీ 17 వ వర్ధంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో పీవీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. దేశానిక పీవీ చేసిన సేవలను కొనియాడారు.
ఎమ్మెల్సీలు వాణి దేవీ, ఎంఎస్ ప్రభాకర్ రావు, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డా.నరసింహ చార్యులు కూడా పీవీకి నివాళులు అర్పించారు.