హైదరాబాద్, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ): అపర మేధావి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ ఈ నెల 22న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నిర్వహిస్తున్నట్టు పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యుడు మహేశ్ బిగాల ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్కు, సహకరించిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశవరావు. ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ కుటుంబీకులు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు.