Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
Ajay Kumar | తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఒకే చోట 23 ఎకరాల భూమిని కేటాయించి, క్యాబినెట్ ఆమోదంతో జీవో జారీ చేశామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
Ajay Kumar | తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఒకే చోట 23 ఎకరాల భూమిని కేటాయించి, క్యాబినెట్ ఆమోదంతో జీవో జారీ చేశామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని, వివిధ రాజకీయ పక్షాలతో కలిసి తన సంపూర్ణ మద్దతు, సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో 4 లక్షల మంది సాక్షిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటి మంత్రి హరీశ్ రావు, తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనే (ఎస్సార్ గార్డెన్ వెనుక నుండి వెంకటాయపాలెం వరకు) 23 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని గుర్తించామన్నారు. రెవెన్యూ సర్వే, మార్కింగ్, ల్యాండ్ ఏలియనేషన్ పూర్తి చేసి, జర్నలిస్టుల సొసైటీకి అప్పగించడంతో పాటు అంతర్గత రోడ్లు, వీధి దీపాల కోసం సుడా (SUDA) నుండి రూ. 2 కోట్లు కూడా మంజూరు చేశామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, నేటికీ జర్నలిస్టుల పేరు మీదనే ఆ 23 ఎకరాలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్లుగా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. గతంలో కేటాయించిన భూమిలో 8 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మూడు నెలల క్రితం ఇచ్చిన హామీ ఏమైంది..వైరా, చింతకాని సభల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిపోయాయని విమర్శించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి మన జిల్లా నుండే ఉన్నప్పటికీ జర్నలిస్టుల పట్ల కనీస సానుభూతి చూపకపోవడం శోచనీయమన్నారు.
ప్రభుత్వాలు మారినా ప్రజలకు, జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు మారకూడదని, కడుపులో ప్రేమ, గుండెల్లో ఆర్ద్రత ఉంటే 24 గంటల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల హామీలుగా దీనిని మళ్లీ వాయిదా వేయకుండా తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్ట్ -టీజెఫ్ ’ అధ్యక్షులు చిర్రా రవి, ఆకుతోట ఆదినారాయణ, సాంబశివరావు, ప్రశాంత్, శ్రీనివాస్,నాయకులు ఖమర్, పగడాల నాగరాజు,పిన్ని కోటేశ్వరరావు, ఎండీ పాషా, దడాల రఘు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Kumar | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించాలి : పువ్వాడ అజయ్ కుమార్
పిట్టలదొరకు పుట్టెడు కష్టాలు
Teja Sajja | హైదరాబాద్లో ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు!
ఎంపీడబ్ల్యూ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ కోసం మంత్రి సీతక్కకు వినతి
Fire Accident | ప్లాటినమ్ గోదాములో భారీ అగ్నిప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

