మంథని, ఏప్రిల్ 16 : జగిత్యాలలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు మంథని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో నియోజకవర్గ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల నుంచే పతనం మొదలవుతుందని అన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి రాకతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు.