హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల సైన్బోర్డులపై క్యూఆర్ కోడ్ పెట్టాలని అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశించారు. కోడ్ స్కాన్ చేస్తే బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దీనిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని సోమవారం ట్విట్టర్లో జీహెచ్ఎంసీ, సీడీఎంఏ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.