హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): ‘ఎన్నికల ముందు జై బతుకమ్మ.. ఎన్నికలైన తర్వాత నై బతుకమ్మ’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ వేదికగా చురకలంటించారు. ‘బతుకమ్మను పక్కనబెట్టు.. సోనియమ్మకు జై కొట్టు..ఇదే కదా అసలైన మార్పు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
1978లోబతుకమ్మ వేడుకల్లో ఇందిరాగాంధీ పాల్గొన్న ఫొటో, గత ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న చిత్రంతో పాటు బతుకమ్మను ఎత్తుకున్న ప్రియాంక, సోనియాగాంధీ ఫొటోలను ట్యాగ్ చేశారు.