హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): 2025-26 వానకాలం సీజన్‌కు ధాన్యం కొనుగోళ్ల పాలసీని పౌరసరఫరాల సంస్థ విడుదల చేసింది. ధాన్యంలో తేమ 17 శాతానికి మించొద్దని సూచించింది. ఒకవేళ తేమ 17 శాతానికి మించి ఉంటే ధాన్యం కొ నుగోలు చేయరు. సంస్థ కమిషనర్ స్టీఫెన్వ్రీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. నూతన పాల సీ ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించా రు. ఈ సీజన్లో 75 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. సీఎమ్మాఆర్లో భా గంగా రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు, గడువు తదితర అంశాలపై గత సంవత్సరం మాదిరిగానే నిబంధనలను పొందుపరిచింది.
డిసెంబర్ 31లోపు బ్లెండింగ్ మిషన్స్, సార్టె క్స్ మిషన్లు ఉన్న మిల్లులకే ధాన్యం కేటాయించాలని నిర్ణయించింది. గతంలో సీఎమ్మాఆర్ బకాయిలున్న డీఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని నిర్ణయించింది. సీఎమ్మాఆర్ బకాయిల పై డీఎంలతో ‘నో డ్యూస్ సర్టిఫికెట్’ ఉంటేనే ధాన్యం ఇవ్వనున్నది. దీంతోపాటు ధాన్యం కేటాయించాలంటే మిల్లింగ్ సామర్థ్యం మొత్తంలో 50% విలువను బ్యాంక్ గ్యారెంటీగా ఇవ్వాలని షరతు పెట్టింది. ధాన్యం కేటాయింపులో పీపీసీ కేంద్రాల నుంచి 8కి.మీ దూరంలో ఉన్న మిల్లులకు ప్రథమ ప్రాధా న్యం ఇవ్వాలని, ఆ తర్వాతే మిగిలిన మిల్లుల కు ధాన్యం కేటాయించాలని స్పష్టంచేసింది. ముందుగానే దూర ప్రాంతాల మిల్లులకు ధాన్యం కేటాయిస్తే అందుకు సంబంధించి జిల్లా అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉం టుంది. ధాన్యం కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులుంటే 180042500333, 1967 నంబర్లకు ఫిర్యాదుచేయాలని సూచించింది.