నేడు రాష్ర్టానికి పంజాబ్ అధికారులు
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్‌కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.
- సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటన
- మిషన్‌కాకతీయ పథకంపై అధ్యయనం
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్‌కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ రీజినల్ రిసెర్చ్ స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మన్మోహన్జిత్ సింగ్, భూమి, నీటిపారుదల విభాగం శాస్త్రేవేత్తలు సంజయ్ సాత్పుతే, అబ్రార్ యూసుఫ్‌తో కూడిన బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నది.
బుధవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేట జిల్లాకు వెళ్లి అక్కడి చెరువులు, చెక్‌డ్యామ్‌లను పరిశీలించనున్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం నిజ్లాపూర్, కొమిరెడ్డిపల్లి, అడ్డాకల్ మండలం గౌరిదేవిపల్లి, రాచర్ల, నుస్రుల్లాబాద్ పెద్ద చెరువులను పరిశీలించనున్నారు. మిషన్‌కాకతీయ చెరువులు, చెక్‌డ్యాంలు, భూగర్భజలాల రీచార్జింగ్ విధానాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం జలసౌధలో రాష్ట్ర సాగునీటిపారుదల, భూగర్భ జలశాఖల అధికారులతో పంజాబ్ బృందం సమావేశం కానున్నట్టు రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

