కరువు ప్రాంతాల్లో పసిడి పంటలు పండించేందుకుగానూ భూగర్భ జలాల పెంపునకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వం చేసిన కృషి అమోఘమని పంజాబ్ బృందం సభ్యులు కితాబిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం, సాధించిన ఫలితాలను అధ్యయనం చేసేందుకు పంజాబ్‌కు చెందిన అధికారుల బృందం మంగళవారం రాష్ర్టానికి రానున్నది.