హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 38,31,907 చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలన్నది వైద్యారోగ్యశాఖ లక్ష్యం కాగా 40,57,311 మందికి వేశారు. లక్ష్యానికి మించి 105.9 శాతం వ్యాక్సినేషన్ నమోదైంది. ఇంటింటి సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది సోమ, మంగళ వారాల్లో 89,09,732 ఇండ్లను సందర్శించి, వివరాలు నమోదు చేశారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వైద్య సిబ్బంది మరో మారు ఇండ్లను సందర్శించి, చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేయనున్నారు.