హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గద్వాల నియోకవర్గం నుంచి డీకే అరు ణ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టు గెజిట్ ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్‌కుమార్ తెలంగాణ సీఎస్, సీఈవో, అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజిట్‌లో ప్రచురించాలని పేర్కొంటూ తీర్పు కాపీని జత చేశారు.