హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : విద్యార్థులు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడానికి సీబీఎస్ఈ మానసిక కౌన్సెలింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల ప్రాక్టికల్స్ సోమవారం నుంచి, థియరీ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు మానసిక కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు సీబీఎస్ఈ ప్రకటించింది. ఇందుకు 1800118004 ఉచిత ఐవీఆర్ఎస్ ఫోన్‌కాల్, టెలికౌన్సెలింగ్, పాడ్‌కాస్ట్‌లు తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని సీబీఎస్ఈ డైరెక్టర్ రామశర్మ తెలిపారు.