హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ-2003 టీచర్లకు పాత పింఛన్ అమలు చేసే అంశంపై ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం, కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం హేయమని పీఆర్టీయూ టీఎస్ పేర్కొన్నది. ఈ మేరకు ప్రభుత్వ తీరును సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్‌రెడ్డి, ఎస్ భిక్షంగౌడ్ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. 2004 సెప్టెంబర్1కి ముందు నోటిఫికేషన్ జారీచేసి, అనంతరం నియామకాలు పొందిన ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. ఇటీవల సీఎం, డిప్యూటీ సీఎం తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీతో జరిపిన చర్చల్లోనూ ఈ అంశంపై సానుకూలంగా ఉన్నామని హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
దురదృష్టకరం : ఎస్టీయూ టీఎస్
డీఎస్సీ 2003 టీచర్లకు పాత పింఛన్ అ మలుపై సర్కార్ తీరు దురదృష్టకరమని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షప్రధాన కా ర్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ శనివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ఉత్తర్వులు, హైకోర్టు తీర్పులున్నప్పటికీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం దారుణమని పేర్కొన్నారు.