న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. అయితే ఇంకా రెండు డిమాండ్లు మిగిలి ఉన్నాయని చెప్పారు. (Abhijeet Dipke) ‘భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం. ఆయన రాజీనామా చేశారు, కానీ మాకు ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయి. మేం ఇలాగే వెళ్ళిపోము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందకూడదా? ఖచ్చితంగా అందాలి కదా? ఆ కుటుంబాలన్నీ రూ.1 కోటి పరిహారం పొందేందుకు అర్హులు’ అని అన్నారు.
కాగా, 20వ తేదీన గూండాల్లా ప్రవర్తించిన పోలీస్ సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవడం మిగిలిన తమ రెండో డిమాండ్ అని అభిజీత్ దిప్కే తెలిపారు. అంతేకాకుండా, జూలై 20న లేదా ఆ తర్వాత విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ‘గుర్తుంచుకోండి, బొద్దింకలతో పెట్టుకోవద్దు’ అని ఆయన అన్నారు.
This is democracy. He has resigned. We have two more demands. We won’t go like this.
Dharmendra Pradhan has resigned. But the families of the children who committed suicide should receive compensation of one crore rupees. They should get it.
One crore rupees compensation to all… pic.twitter.com/CyhfGDUola— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026