Nara Rohit | టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ హీరోగా గుర్తింపు పొందిన విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు (జూలై 25) నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో రోహిత్ ఎంతో స్టైలిష్, డైనమిక్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన తెలంగాణ పోలీస్ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పోస్టర్‌తో నారా రోహిత్ ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్న విషయం దాదాపు ఖరారైంది. ఆయన పాత్ర సాధారణ పోలీస్ పాత్ర కాకుండా, మాస్ అప్పీల్‌తో పాటు కథను కీలక మలుపు తిప్పే శక్తివంతమైన అధికారిగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చాలా కాలం తర్వాత రోహిత్ మరోసారి యూనిఫామ్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.ఇప్పటికే వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కుటుంబ భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారని సమాచారం.
ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌తో పాటు నారా రోహిత్ పవర్ఫుల్ పోలీస్ పాత్ర కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.