హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : సీపీఎస్‌ను రద్దుచేయాలనే డిమాండ్‌తో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు పీఆర్టీయూ టీఎస్ ప్రకటించింది. పెన్షన్ విద్రోహ దినమైన సెప్టెంబర్ 1న ఇందిరాపార్క్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఎంప్లాయిస్ జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు బుధవారం నారాయణగూడలోని పీఆర్టీయూ కార్యాలయంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ -2003 టీచర్లకు పాత పింఛన్ వర్తింజేయాలని కోరారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ సెక్రటరీ జనరల్ సీఎల్ రోజ్ మహాధర్నాకు హాజరవుతున్నట్టు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి తెలిపారు.