రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేశాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అధికార పార్టీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ రెడ్డి సన్నిహితుడు గాల్‌రెడ్డి హర్షవర్దన్ రెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. అలుగుబెల్లి నర్సిరెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోదండరామ్‌కు భారీ షాక్ తగిలింది. ఆయన బలపరిచిన పన్నాల గోపాల్‌రెడ్డికి కేవలం 24 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఈ సందర్భంగా పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసినప్పటికీ అంతిమంగా టీచర్లే గెలిచారని అన్నారు. తనపై బాధ్యత ఉంచి తమ అమూల్యమైన ఓటువ ఏసి ఎమ్మెల్సీగా విజయం చేకూర్చి పెట్టినందున ఇక నుంచి రానున్న రోజుల్లో పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు పటిష్టపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.
ఓడిపోయినప్పటికీ విద్య ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. హర్షవర్ధన్ రెడ్డి ఎలిమినేషన్ తర్వాత నర్సిరెడ్డి గెలవననే ఆలోచనతో కౌంటింగ్ సెంటర్ నుండి బయటికి వెళ్లి మీడియా మిత్రులతో మాట్లాడారు.. ఓటమి అనేది సహజమని గతంలో నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులు ఎప్పుడూ శ్రీపాల్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి తనకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఓట్లు వేసిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన రానున్న రోజుల్లో విద్యా వైద్యం వ్యాపారీకరణ కావద్దు అని డిమాండ్‌తో పోరాటం చేస్తానన్నారు. శ్రీపాల్ రెడ్డి విజయాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్న ఆయన రానున్న రోజుల్లో విద్యాభివృద్ధి కోసం విద్య ప్రైవేట్ స్వీకరణ కాకుండా చూడడం కోసం పోరాటం చేస్తానని అన్నారు.
Nalgonda Mlc