ఆదిలాబాద్ టౌన్, మే15: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతోనే తెలంగాణలో ప్రగతి సాధ్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం కొత్త్తగూడెంలో 15 మంది దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను ఎమ్మెల్యే పంపిణీచేశారు. అనంతరం అంబేద్కర్, బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల ఆత్మగౌరవం నిలబెట్టేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పునరుద్ఘాటించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తోడు దొంగలని విమర్శించారు.