హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు చదివిన వారికి ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అసోసియేషన్ సభ్యులు మంత్రికి వినతి పత్రం అందించారు. తమ అభ్యర్థనపై మంత్రి సానుకూలంగా స్పందించారని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.