రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి
రాష్ట్రంలోని యూనివర్సిటీలు | రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బీ.జే. రావుకు సూచించారు. గురువారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీ.సీ. ప్రొ. బీ.జే. రావు సమావేశమయ్యారు. ఆయన ఇటీవలే వీ.సీ.గా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా అభివృద్ధి, విద్యా విధానంలో అమలు చేయాల్సిన నూతన విధానాలు, విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలపై వారు చర్చించారు.
ఈ భేటీలో వినోద్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న యూనివర్సిటీలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేయూతను అందించాలని సూచించారు.
నూతన విద్యా విధానంలో బోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అందు కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చొరవ తీసుకోవాలని, రీసెర్చ్ వంటి అంశాలపై సహకారాన్ని అందించాలనీ వినోద్ కుమార్ కోరారు. తన వైపు నుంచి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని బీ.జే. రావు అన్నారు.
ఈ సందర్భంగా బీ.జే. రావును వినోద్ కుమార్ సన్మానించారు. ఈ భేటీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ పీ. వెంకట రమణ కూడా పాల్గొన్నారు.
అన్‌లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్‌లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

