హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ): భద్రాచలం ఆలయ అ భివృద్ధికి నిధులివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాద్రిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మోదీ సర్కారుపై ఉన్నదని స్ప ష్టం చేశారు. అందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం సరికాదని పేర్కొన్నారు. రైల్వేలైన్ ఏర్పాటు చేయకపోవడంతో భక్తుల రాకపోకలకు ఇ బ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఆలయ ప్రాశస్థ్యాన్ని గుర్తించే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పా టు చేశారని గుర్తుచేశారు. ఏటా లక్షల మంది సందర్శించే ఆలయాభివృద్ధి కోసం ఇప్పటికై నా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
భక్తుల ఇంటికే భద్రాద్రి రాముడి తలంబ్రాలు ; తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ): కోరుకున్న భక్తుల ఇంటికి భద్రాద్రి రాముడి తలంబ్రాలు చేరవేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సెంటర్లు లేదా tgsrtclogistics.co.ina ద్వారా రూ. 151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. ఈ మేరకు సోమవారం బస్‌భవన్‌లో తలంబ్రాల బుకింగ్ పో స్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆవిష్కరించారు. వివరాలకు 040-69440069, 040-69440000 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సీవోవో డాక్టర్ రవీందర్, ఈడీ మునిశేఖర్, సీటీఎం శ్రీధర్ పాల్గొన్నారు.