హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన సేవలను అందించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులకు ఎంపికైన 121మంది అభ్యర్థుల కు సచివాలయంలో నియామక పత్రాలను గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసి హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపా రు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.