బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిరసనసెగ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్శన్‌రెడ్డి కాన్వాయ్ పట్టణంలోకి ప్రవేశించగానే, బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ కారును అడ్డంగించేందుకు దూసుకువచ్చారు.
- కాన్వాయ్‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
- అరెస్టు చేసి పీఎస్‌కు తరలింపు
బోధన్, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్శన్‌రెడ్డి కాన్వాయ్ పట్టణంలోకి ప్రవేశించగానే, బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ కారును అడ్డంగించేందుకు దూసుకువచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిధు లు మంజూరై నిర్మించిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడమే తప్ప, రెండేండ్లుగా బోధన్‌లో కొత్తగా పనులు ఎందుకు చేపట్టడంలేదంటూ ఆందోళనకు దిగారు. ‘సుదర్శన్‌రెడ్డి గో బ్యాక్’, ‘సుదర్శన్‌రెడ్డి డౌన్-డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్‌కు అడ్డుపడటంతో పోలీసులు, కాంగ్రెస్ నా యకులు కంగుతిన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. సుదర్శన్‌రెడ్డి పర్యటన అనంతరం మధ్యాహ్నం వారిని విడుదలచేశారు. బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మంజూరుచేశారని తెలిపారు. ఆ భవనానికి తానే ఏదో చేసినట్లుగా సుదర్శన్‌రెడ్డి ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

