హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): సమస్యలు పరిష్కరించాలంటూ సీ సీఎల్ఏ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు సోమవారం ధర్నాకు దిగారు. వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభు త్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నా రు. దూరప్రాంతాలకు బదిలీ చేసినవారిని సొంత జిల్లాలకు పంపాలని కోరారు. ఆప్ష న్లు ఇచ్చి రెవెన్యూ శాఖలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్, మిషన్ భగీరథ వంటి శాఖల్లోకి బదిలీ అయిన వీఆర్ఏలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎంఆర్వో సెక్షన్ ఇన్చార్జి లచ్చిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.