నవాబుపేట, అక్టోబర్15: రిజినల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు వినూత్న నిరసనకు దిగారు. ట్రిపుల్ ఆర్ తమకు వద్దంటూ బుధవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లోని పొలాల్లో నిరసన తెలిపారు. దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాలకు చెందిన రైతులతో కలిసి చించల్పేట, చిట్టిగిద్ద దాతాపూర్, నవాబుపేట, వట్టిమీనాపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఆర్ వెళ్తున్న సర్వే నంబర్లలోని పంట పొలాలను పరిశీలించి నిరసన చేపట్టారు. కొత్త అలైన్మెంట్ వద్దంటూ నినదించారు. పాత అలైన్మెంట్ ప్రకారమే పనులు చేపట్టాలని, కొత్త అలైన్మెంట్తో తమ బతుకులు ఆగమవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.